స్వచ్చ హైదరాబాద్ కి స్వచ్చ చెత్త నిర్మూలన ఆవశ్యకత #1


భారతదేశం లో  పట్టణ చెత్త నిర్మూలన, పారిశుద్దన పట్టణ పరిపాలక సంఘాల బాధ్యత

కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారము ప్రతి మనిషి ప్రతి దినము భారత దేశం లో 0.2 ~ 0.6 కేజీల చెత్త ని వెలువరుస్తున్నారు. ఇది సాలీన 5శాతం పెరుగుతున్నది

భారత దేశం ఇప్పటికీ  చెత్త నిర్మూలన, పారిశుద్దన కి ఎక్కువగా పురాతన ఓపెన్ డంపింగ్ ల్యాండ్‌ఫిల్  పద్దతినే అవలంబిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అంచనా ప్రకారం 2047 సంవత్సరం కల్లా  140,000 చదరపు కిలోమీటర్ ల భూమి అవసరము ఇది మన జీహెచ్ఎంసీ(922 కిలోమీటర్ల ) కంటే ఎక్కువ !

అప్పుడు ఈ చెత్త వేసిన ప్రదేశాలనుంచి 40 మిలియన్ టన్నుల ప్రమాదకర మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుంది, ఇది ప్రస్తుత ఉత్పత్తి కంటే నాలుగు  రెట్లు .

మన దేశ  చెత్త  లో  సేంద్రియ వ్యర్థ శాతం  ఎక్కువ (40%~60%)

అందువల్ల గ్రీన్ హౌస్  వాయువు ఉత్పత్తి ఎక్కువ: మీథేన్ (50%) కార్బన్ డయాక్సైడ్ (45%) నత్రజని (5%)

హైదరాబాద్ నగరం ఎండాకాలం లో  ఉష్ణోగ్రత ఎక్కువ అప్పుడు ఈ  గ్రీన్ హౌస్  వాయువు ఉత్పత్తి ఐదు రెట్లు ఎక్కువవుతుంది అందువల్ల ఎండా కాలం వీటి పరిసరాల్లో ప్రజల ఆరోగ్యం పై విపరీత ప్రభావం కనిపిస్తుంది.

ఐతే  గ్రీన్ హౌస్  వాయువు ఉత్పత్తి జవహర్ నగర్ లాంటి పెద్ద డంప్ యార్డ్ మాత్రమే కాదు, చెత్త ఇంటి  నుంచి వీధి చెత్త కుండి కి, ఆ తరువాత దగ్గరి ట్రాన్స్ఫర్ స్టేషన్ కి ఆపై ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి జవహర్ నగర్ కేంద్ర డంప్ యార్డ్ కి తీసుకెళ్లే ప్రతి ఒక్క పని లోను వెలువడుతూ ఉంటాయి, ఇవి కనిపించవు ఎప్పుడు సహజంగా చెత్త నుంచి వెలువడుతూ ఉంటాయి.

తెలంగాణా ప్రబుత్వం ఇప్పుడు చెత్త సేకరణ దాన్ని తొందరగా ఇంటినుంచి ట్రాన్స్ఫర్ స్టేషన్ లకి . తరలించే టిప్పర్ లను ప్రవేశ పెట్టింది, ఇది అభినందనీయం, కాస్త ఈ  ప్రమాదకర వాయువుల ఉత్పత్తి నివాస ప్రాంతాల్లో తగ్గుతుందని ఆశించవచ్చు.

చెత్త భూ పూడిక ప్రాంత కాలుషిత వాయువుల ప్రభావం

1. ఆసిడ్ వాయువులు

నత్రజని ఆక్సైడ్ & సల్ఫర్ డయాక్సైడ్ ఫలితంగా  ఆస్తమా ఉన్నవారికి చికాకు మరియు రెస్పిరేటరీ ప్రభావం చూపుతాయి

  1. డయాక్సిన్లు (ప్రజలలో వీటి పై అవగాహన తీసుకుడావడం చాలా అవసరం)

చెత్తని కాల్చినపుడు వెలువడే కనిపించని విష వాయువులు  డయాక్సిన్లు .

డయాక్సిన్లు పునరుత్పత్తి మరియు అభివృద్ధికరమైన సమస్యలు కారణమవుతుంది,

రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది హార్మోన్లు జోక్యం మరియు క్యాన్సర్ కూడా కారణం అవుతుంది.

అత్యధిక డయాక్సిన్స్ వల్ల స్వల్పకాలిక ప్రభావం చర్మం చెదురుమదురుగా నలుపు, చర్మ గాయాలకు, మరియు కాలేయ పనితీరు మార్పు దారితీయవచ్చు.

దీర్ఘకాల ప్రభావం రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి,నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ మరియు పునరుత్పత్తి  బలహీనత లతో ముడిపడి ఉంది. 

  1. మీథేన్

5% నుండి 15% మధ్య సాంద్రత వద్ద పేలుడు వాయువు అవుతుంది

ఉచ్ఛ్వాసము వల్ల వికారం, వాంతులు, తలనొప్పి కలిగిస్తుంది

చాలా అధిక సాంద్రతతో ఉంటే శ్వాసకోశ అరెస్టు, కోమా మరియు మరణం కూడా కారణం కావచ్చు 

  1. కార్బన్ డయాక్సైడ్

6% పైగా ఉన్నప్పుడు ఏకాగ్రతా, తలనొప్పి, మైకము, మానసిక గందరగోళం కారణమవుతుంది, బిపి పెరుగుతుంది

10% పైగా ఉన్నప్పుడు స్పృహ పోవడం జరుగుతుంది

 * 1983-1997 సమయంలో బ్రిటన్ లో 20 లాండ్ ఫిల్ సైట్లు స్టడీ దగ్గరగా నివసిస్తున్న జనాభా లో ఆరోగ్యక్షీణత  39% పెరుగుదలను కనుగొంది

 

డిల్లీ లో గ్రౌండ్ వాటర్ పై అక్కడి లాండ్ ఫిల్ డంప్ యార్డ్ ల ప్రభావం ఈ విధంగా ఉంది

Delhi landfill site effect on Under Ground Water1కిలోమీటర్ దూరం వరకు భూమి అంతర నీటి పై ప్రభహవం కనుగొన్నారు

ఈ విషయాలే కాకుండా నాగరాల్లోఖాళీ ప్రదేశం లేక పోవడం, నగరవాసులు  తమ నివాసం పరాసరాల్లో వద్దని గట్టిగా ప్రతిగటించడం Not In My Back Yard (NIMBY)  తో ప్రతి మహా నగరం లాగే హైదరాబాదు మహా నగరానికి చెత్త నిర్మూలన ఒక పెద్ద సమస్య  ప్రపంచంలో సాంకేతిక పద్దటులేము ఎమున్నాయి , ఈ  పద్దతి ఏ పరిస్తితి కి మేలు అనేది తరువాతి వ్యాసం లో ..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s