రాధాకృష్ణకు తలంటు స్నానం 


కట్టా మీఠా


ఇవాళ రాధాకృష్ణది అదే పరిస్థితి. ఏదో ఒకటి రాయడం.. రివర్సై తల పట్టుకోవడం. తెలంగాణ మీద బురద చల్లాలనుకుంటాడు. కానీ అది ఆయన నెత్తినే పడుతుంది. మహర్జాతకుడు.. ఏది కాకూడదని రాస్తాడో సరిగ్గా అదే సాక్షాత్కారమవుతుంది. తెలంగాణ రాకుండా ఆపాలనుకున్నాడు. వచ్చింది. ఇక్కడన్నీ ఆంధ్రవాళ్ల పరిశ్రమలే.. ఇక వెళ్లి పోయినట్టే అన్నాడు. ఒక్కటీ కదల్లేదు. ఫార్మా పరిశ్రమలు కర్ణాటకకు తరలి పోతున్నాయోచ్ అని గంతులేశాడు. రివర్సయింది.


కరెంటు కోతలతో తెలంగాణ ఖతం అన్నాడు. కానీ కోతలే ఖతమైనయి. ఆసరా మీద.. రేషన్ కార్డుల మీద చివరికి నిన్నటి ఆర్టీసీ సమ్మె మీద కుడిచేత్తో ఎడం చేత్తో భవిష్యవాణి రాస్తూనే ఉన్నాడు. అన్నీ సుఖాంతమయ్యాయి. ఆకలి రుచి ఎరుగదు.. ఆర్తి సభ్యత ఎరుగదు. రాధాకృష్ణకు తాజాగా రవీంద్రభారతిలో రాధారెడ్డి, రాజారెడ్డి దంపతుల నాట్య ప్రదర్శన అంశం దొరికింది. కూచిపూడి నాట్యకళలో ప్రపంచఖ్యాతిగాంచిన రాధా రాజారెడ్డి దంపతులకు రవీంద్రభారతిలో ప్రదర్శనకు అవకాశం దొరకలేదు. సదరువైనం మీద ఆగమేఘాల మీద ఓ కథనం వండేశాడు. ఇటు పత్రికలోనూ అటు తన ఆస్తమా చానెల్‌లోనూ మోత మోగించాడు.

ఎంటయ్యా అంటే కూచిపూడి ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాట్యకళ కాబట్టి ఆ కళతో తెలంగాణతో సంబంధం లేదనే కారణంగా ఈ ప్రదర్శనకు ప్రభుత్వం నిరాకరించిందట. సత్యప్రమాణంగా ఈ విషయాన్ని రవీంద్ర భారతి వర్గాలే రాధాకృష్ణకు చెప్పాయట. ఇంకేముంది? కేవలం ఆంధ్రప్రాంత కళ ప్రదర్శించిన కారణంగా తెలంగాణ బిడ్డలకే…

View original post 231 more words

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s