Monthly Archives: April 2015

ఒక టీఎంసీ నీటి విలువ


కట్టా మీఠా

godavaribesin

గోదావరిలో ఇప్పటివరకు మనం ఉపయోగించుకోగా ఇంకా మనకు హక్కుగా మిగిలి ఉన్న నికరజలాలు 487 టీఎంసీలు. గోదావరిలో వరద జలాలపై కూడా రాష్ర్టానికి పూర్తి హక్కులున్నాయి. ఇప్పుడు సీడబ్ల్యుసీ అంచనాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ప్రాతిపదికన ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్న నీరు గత యాభైయ్యేళ్ల సగటు 1781 టీఎంసీలు. సముద్రంలో కలిసిన జలాలు గత పదిహేనేళ్ల సగటు 2783 టీఎంసీలు. వరద జలాలు ప్రతిఏటా సుమారు మరో 500 నుంచి 1000 టీఎంసీలు ఉపయోగించుకునే హక్కు, అవకాశం మనకు ఉంది.

-ఒక శతకోటి ఘనపుటడుగుల (థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్-టీఎంసీ) నీరు అంటే

-2.80 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు.
-2831.6 కోట్ల లీటర్ల నీరు.
-22,956.84 ఎకరాల్లో ఒక అడుగు మందం నిలుకోగలిగిన నీరు.
-6000 ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి పండించవచ్చు.
-రూ.25కోట్లనుంచి రూ.30కోట్ల విలువచేసే 2,40,000 బస్తాల ధాన్యం పండించవచ్చు.
-10,000 ఎకరాల్లో ఆరుతడి పంటలు పండించవచ్చు.
-15,000-20,000 ఎకరాల్లో బిందుసేద్యం చేయవచ్చు.
-56,63,200 వాటర్ ట్యాంకర్లు (5000 లీటర్లవి) నింపవచ్చు.

View original post

Advertisements

Pennywise Pound Foolish Rule of AP CM’s (CBN&YSR) in Srisailam Left Bank Power House 2001-2011


Sri N Chandra Babu Naidu of TDP was the Chief Minister of Andhra Pradesh (current AP + Telangana) for 9 years during 1995~2004 followed by Late Sri Y S Rajashekar Reddy of Congress

During TDP Naidu Regime Srisailam Left Bank Power Station Project was completed.

The objective of the project was to meet the increasing demand for electric power
(particularly during peak hours) in AP by constructing a pumped-up power plant in AP
that would utilize the Srisailam Reservoir as its upper reservoir and the Nagarjugasagar
Reservoir as its lower reservoir, effectively utilizing the river flow rate.

Typically such project costs are Prohibitive and cost a lot more than normal Hydro power station to achieve many parameters including most tough ones the Reversible Francis Turbine has to be located below the Discharge Level for it to receive the Water when it plans to Pump.

Japan’s JICA Loan itself was 26 Billion Yen which today is equivalent of more than Rs 13,000 crores

1st 150 MW unit was commissioned on 2001-April-26

6th 150 MW unit was commissioned on 2003-April-04

It’s atrocious to note that this so-called Hi Tech Chief Minister of such a large state running power supply challenges chose to pursue Huge Gas Power Stations investments without foresight that Gas first priority goes to fertilizer plants, ended up with huge dead investments in Gas Power Plants now and not bothered to spend and complete 100 crores to fix the BIG Design Slip in this project and maximize the optimal use of precious power by storing it during it lean time by pumping water into Srisailam, Very short and quick way to Save Power and STORE it for later use .

It  was realized thru commissioning that without constructing weir full-fledged use of Pumped Operation was not possible , below 1st Dec 2003 News gives good information..

http://www.business-standard.com/article/economy-policy/srisailam-weir-to-be-ready-by-july-04-103120101098_1.html

Its Pennywise Pound Foolish of Both AP CM’s Sri Chandra Babu Naidu and Late Sri Y S Rajashekhar Reddy

At least N Kiran Kumar Reddy of Congress for all the flak he received and wrongs he did too, atleast he finally floated the tender and completed it for just 35 Crores !

http://www.tenderdetail.com/Indian-Tenders/TenderNotice/3084126/86722e5f-8ad2-9cdc-16d0-3b45d5e6aa3f$srisailam-left-bank-hydro-electric-scheme-weir-project-construction-of-balance-portion-of-weir-across-river-krishna-at-about

Another National Wastage and Damage of Precious National Resources as well as Tax Payer Money by the Government of Andhra Pradesh for 10 long years from 2001 till 2011 is Shocking !

Also appalled at the Then lone Andhra Media and now Andhra Telanagana Media that do not bring out this vital information to educate the people of both states ..

Even today the media is shying away from reporting why the Krishnapatnam Plant is not fully operational for over 12 months ?

The first unit of 800 mw (2×800 mw) of Sri Damodaram Sanjeevaiah Thermal Power Station in Krishnapatnam has been synchronised with the Power Grid late on March 31, 2014

చెరువులతోపాటే ప్రాజెక్టులు


కట్టా మీఠా

TEL_Major Irrigation ProjectsMap (1)

మిషన్ కాకతీయ విజవంతమయి చెరువుల పూడిక తీత పూర్తయినా తెలంగాణ పల్లెలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశలేదు. కాలమయితే పర్వాలేదు. కాలాలు కాకపోతే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకం. ఇందుకు ఒకటే సమాధానం. తెలంగాణలో ఇప్పటివరకు ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ ఒక యజ్ఞంలా పూర్తి చేయడమే.

బహుశా 1976-77లలో అనుకుంటా. పదవ తరగతిలో ఉన్నా. ఇంటి గడపలో కూర్చుని చేపలు పట్టిన సందర్భం. ఆ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. పది రోజులు సూర్యుడిని చూడలేదు. ఆకాశానికి చిల్లులు పడినట్టు నిరవధికంగా చినుకు పడుతూనే ఉంది. ముసురుపెట్టి, నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్మి పగటివేళ కూడా చిమ్మని చీకటి. చెరువులు వారం రోజులుగా అలుగులుపోస్తున్నాయి. కుక్కడం చెరువు నిండి నీరు వెనుకకు తంతున్నది. ఊరిపైన నల్లగుంట చెరువుదాకా ఎటు చూసినా నీరే. ఊళ్లో వీధులన్నీ ఏరుల్లా మారాయి. మా ఊరి నీళ్లన్నీ కుక్కడం చెరువుకు ప్రవహిస్తాయి. నల్లగుంట చెరువు తెగుతుందేమోనని అందరూ భయపడ్డారు. చెరువు తెగితే వరద మా ఊరు మీదే పడుతుంది. ఇంటి గడప ముందు మూడు మెట్లుంటే మొదటి మెట్టు మునిగి నీరు ప్రవహిస్తున్నది. అలా ప్రవహించబట్టి అది ఆరో రోజు. సరదాగా ఆడుకుంటూ చూస్తే చేపలు ఎగురుకుంటూ ఎదురెక్కుతున్నాయి. అవి కుక్కడం చెరువు నుంచి ఎదురెక్కుతున్నాయి. పదవరోజు తెరిపి నిచ్చిన తర్వాత చూస్తే పైన నల్లగుంట చెరువు, దిగువ పెద్దరెడ్డి చెరువు నిండు గర్భిణిలా ఉన్నాయి. పొలాలన్నీ జలాలతో…

View original post 851 more words

పాత భీమానే కొత్త పాలమూరు ప్రాజెక్టు


కట్టా మీఠా

palamuru1

మూడు జిల్లాల రూపురేఖలు మార్చే పాలమూరు పథకం
పది లక్షల ఎకరాలకు నీరు,
ఏటా మూడు వేల కోట్ల పంట
నాలుగు ఉప నదులకు పునర్జన్మ
గ్రావిటీతో తరలింపు, లిఫ్టులతో రిజర్వాయర్లకు
మూడు లిఫ్టులు, మూడు రిజర్వాయర్లు
మూడు జిల్లాలు, పది లక్షల ఎకరాలు లక్ష్యం
కరువు జిల్లా రూపు రేఖలు మార్చనున్న ప్రాజెక్టు
నాలుగు ఉపనదులకు జాలుజలాలు

తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటున్నది. ఆరు దశాబ్దాలుగా కోల్పోయినవన్నీ వెతికి వెతికి పట్టుకుంటున్నది. దత్తపుత్రులు, ఉత్తపుత్రులు జార విడిచిన కోటి రతనాలను ఒకటొకటిగా ప్రోది చేసుకుంటున్నది. అలాంటి అమూల్య రత్నమే పాలమూరు ప్రాజెక్టు. వలసల శాపం నుంచి పాలమూరుకు విముక్తి కల్పించే వరప్రదాయని. ఒకనాటి భీమా ప్రాజెక్టు… ఇవాళ పాలమూరు ప్రాజెక్టు. సీఎం కేసీఆర్ 14 ఏండ్ల కలల పంట. కొండలు, అడవులు, సొరంగాలు చీల్చుకుని మూడు జిల్లాల్లో బీడు భూములను ముద్దాడే గంగమ్మ. 10 లక్షల ఎకరాల్లో ఏటా మూడు వేల కోట్ల రూపాయలు పండించే వరం. నాలుగు ఉపనదులకు పునర్జన్మ ప్రసాదించే యజ్ఞం. అపర భగీరథుడు కేసీఆర్ తలపెట్టిన గంగావతరణం!

సమైక్య రాష్ట్రం నిర్లక్ష్యం చేసిన భీమా ప్రాజెక్టునే ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టింది. భీమా ప్రాజెక్టుకు నాడు కేటాయించిన నీటినే నేడు పాలమూరు ప్రాజెక్టుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతోపాటు దారి పొడవునా ఉన్న…

View original post 1,121 more words

నీటికోసం కలిసి సాగాలి


కట్టా మీఠా

TEL_Major Irrigation ProjectsMap (1)

రంగారెడ్డికి నీళ్లు తేవడానికి ప్రాణహిత-చేవెళ్ల పథకంలో మాదిరిగా 22 లిఫ్టులు 1757 మీటర్లు ఎత్తిపోయడం అవసరం లేదు. మూడు లేక నాలుగు లిఫ్టులతో 450 మీటర్ల ఎత్తువరకు నీటిని పంపింగ్ చేస్తే రంగారెడ్డి జిల్లాలోకి నీరు వస్తుంది. డిండి, మూసీ నదులతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అనేక వాగులను, రిజర్వాయర్లను పునర్జీవింప చేయవచ్చు.

ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై సీమాంధ్ర మీడియా, వారి అనుకూల మేధావులు చేస్తున్న వాదనలు వారి డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల పూర్తి చేయడంకోసం ప్రారంభించిన ప్రాజెక్టు కాదు. ఎప్పటికీ పూర్తి కాకుండా చూసేందుకు డిజైను చేసిన ప్రాజెక్టు. ఎప్పటికీ వివాదాల్లో నలిగిపోయే విధంగా రూపొందించిన ప్రాజెక్టు. నీళ్లు వచ్చినా రాకున్నా కాంట్రాక్టర్లకు డబ్బులు ముట్టజెప్పేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు. రాయలసీమకోసం శ్రీశైలంను కబ్జా చేసేందుకు చేవెళ్లకు గోదావరి నీటిని ఎరగా చూపిన ప్రాజెక్టు. చేవెళ్లకు రెండువందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నది నుంచి కాకుండా 1055 కిలోమీటర్ల దూరంలోని తుమ్మిడిహట్టి నుంచి తీసుకురావాలనుకోవడం ఎంతపెద్ద కుట్ర? పోనీ అదయినా సక్కగ చేయలేదు. నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలో అక్కడ పనులు ప్రారంభించకుండా, హెడ్‌వర్క్స్‌కు అనుమతులు, ఒప్పందాలు చేయకుండా కాలువలు తవ్వించే దుర్మార్గమైన విధానాన్ని అమలు చేసిన కీర్తి ప్రతిష్ఠలు ఒక్క రాజశేఖర్‌రెడ్డికే దక్కుతాయి. కొందరు మేధావులు వాదిస్తున్నట్టు ప్రాణహిత-చేవెళ్లపై ఎనిమిది వేల కోట్లో తొమ్మిది వేల కోట్లో ఇప్పటికే ఖర్చు చేశారనే అనుకుందాం. ఎల్లంపల్లి రిజర్వాయరు ఎలాగూ హైదరాబాద్‌కు నీరు తీసుకురావడానికి…

View original post 949 more words

ప్రాణహిత పై రెండవ బ్యారేజి అవకాశము


గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి
శ్రీ  కె చంద్రశెకర్ రావు గారికి

నమస్కారములు
ఆర్య
ప్రాణహిత పై ఇప్పుడు మహారాష్ట్ర ప్రబుత్వము తో ముంపు తగ్గించు ప్రత్యామ్నయంలో బాగంగా
ముక్కేదిగూడెం వద్ద 140 మీటర్ ల రెండవ బ్యారేజి కి మహరాస్త్ర ఒప్పుకుంటే ఇప్పటి బ్యారేజి 150 మీటర్ లకు తగ్గించిన
మొత్తము అవసరమైన నీరు వాడడమే కాకుండా జల విద్యుత్ కనీసము 250 MW అదనంగా  ఉత్పత్తి అవుటండని నా అంచనా

 

Pranahita Lower Barrage at Mukkidigudem

మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోగలరని మనవి

మీ అభిమాని తెలంగాణ శ్రేయోభిలాషి

వెంకట్ గాంధీ