ఇది సీమాంధ్ర కేంద్ర ప్రభుత్వమా?


వినాశకాలే విపరీత బుద్ధి

కట్టా మీఠా

Telangana-seemandhra-map-e1395162279484

ఉమ్మడి రాజధాని, ఉమ్మడి అడ్మిషన్లు, ఉమ్మడి హైకోర్టు….అన్నీ ఉమ్మడిగా ఉండే పనిఅయితే ఉమ్మడి రాష్ర్టాన్నే కొనసాగించి ఉండవచ్చుగా? అడ్మిషన్లలో, న్యాయస్థానాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేకదా ఇంతకాలం కొట్లాడింది! హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో సీమాంధ్ర ప్రభుత్వం అత్యంత పక్షపాతంతో వ్యవహరించిందనేగా తెలంగాణ గోసపెట్టింది! మరి ఎవరి ప్రయోజనాలకోసం ఈ ఉమ్మడి వ్యవస్థలు? సీమాంధ్ర సృష్టించిన ఆధిపత్య వ్యవస్థలను, అవి చేస్తున్న అన్యాయాలను కొనసాగించే పనయితే ప్రత్యేక రాష్ట్రమెందుకు?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 16 రాష్ర్టాలు అవతరించాయి. ఏ రాష్ట్రం ఎదుర్కోని విచిత్రమైన పరిస్థితులను తెలంగాణ ఎదుర్కొంటోంది. కేంద్రం ఇప్పటివరకు ఏ రాష్ట్రంపై విధించని ఆంక్షలు తెలంగాణపై విధిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నియంత్రించడానికి, రాష్ట్రం హక్కులపై పరిమితులు విధించడానికి కేంద్రం మునుపెన్నడూ లేనంత శ్రద్ధను కనబరుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వానికేదో పరిపాలించడం చేతగాదన్నట్టు, ఇక్కడ శాంతిభద్రతలకు ఏదో భంగం వాటిల్లినట్టు కేంద్రం ఎందుకు భ్రమపడుతున్నదో అర్థం కాదు. తెలంగాణపై పగప్రతీకారాలతో కేంద్రం వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఎవరిని రక్షించడంకోసం కేంద్రం ఇంతగా ఉబలాటపడుతున్నది? ఏ అక్రమాలకు కాపలాకాయడంకోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నది? తెలంగాణ స్వేచ్ఛను పొందడం ఇష్టంలేని సీమాంధ్ర శక్తులు కేంద్రాన్ని, రాజ్యాంగాన్ని ఇంతగా ప్రభావితం చేయగలగడం ఆశ్చర్యకరం. ఇటువంటి కుట్రలు రెండు ప్రాంతాల మధ్య కలతలు పెంచడానికి దోహదం చేస్తాయే తప్ప సమస్యలను పరిష్కరించవు. హైదరాబాద్‌లో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య మరింత ఉద్రిక్తతలను పెంచుతుంది. కేంద్రం మునుపు జరిగిన రాష్ర్టాల విభజన…

View original post 649 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s