గులాబీ సంకేతాలు


కట్టా మీఠా

telangana_state

గత మూడు రోజులుగా ఒకటే లెక్క…ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికెన్ని సీట్లు వస్తాయి? ఎడతెగని చర్చలు…విశ్లేషణలు…బెట్టింగ్‌లు, చాలెంజ్‌లు. పదహారో తేదీవరకు ఆగక తప్పదు. కనీసం ఏడోతేదీ ఎగ్జిట్ పోల్స్ దాకా వేచి చూడాలి. అయినా తిట్టేవాళ్లను బట్టి, పొగిడేవాళ్లను బట్టి, కాడిపారేసిన వాళ్లను చూసి, ముఖం చాటేసిన వాళ్లను చూసి ఎవరు గెలుస్తారో కాస్తంత అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్‌నే ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఆయన పేరు చెప్పే అక్కడ ఎందుకు ఓట్లు అడుక్కొంటున్నారు? ‘అక్కడ(తెలంగాణలో) కేసీఆర్ వస్తున్నారు, ఇక్కడ మమ్మల్ని గెలిపించకపోతే మీ ఇష్టం’ అని సీమాంధ్ర ప్రజలను బెదిరించడానికి. భావోద్వేగాలు రెచ్చగొట్టి బ్లాక్‌మెయిల్ చేయడానికి. పవన్ కల్యాణ్ అద్దెమైకులాగా అదేపనిగా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. అది తెలంగాణలో కేసీఆర్ విజయ సూచన. ఇక్కడ ‘మా వళ్లే తెలంగాణ వచ్చింది’ అని చెప్పిన బిజెపి నేతలు, టీడీపీ నేతలు అక్కడికి వెళ్లగానే ‘జగన్ వళ్లే రాష్ట్రం చీలిపోయింది’ అని జనాన్ని రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర విభజనపై తమ అజీర్తిని బయటపెట్టుకుంటున్నారు. ఇది కూడా తెలంగాణ విజయమే. ఈసారి నిర్వహించినన్ని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ జరగలేదేమో. అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. రాష్ట్ర విభజన జరిగిన సంధికాలంలో జరుగుతున్న తొలి చారిత్రక ఎన్నికలు కావడం వల్ల అన్ని మీడియా సంస్థలు ఈ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాయి. ప్రాంతీయ మీడియా సంస్థలు, పత్రికలు అన్నీ కూడా టీఆరెస్‌కు…

View original post 534 more words

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s