ఆఖరిమెట్లు


కట్టా మీఠా

పరమపద సోపానంలో ఆఖరి మెట్లు అతిప్రమాదకరమైనవి.

అక్కడ భారీ సర్పాలే తప్ప నిచ్చెనలు ఉండవు. ఆ సర్పాలకు చిక్కకుండా గమ్యం చేరకపోతే అథఃపాతాళానికి పడిపోయి, ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పుడు పరమపదసోపానంలో ఆఖరి మెట్లపైకి వచ్చింది. తెలంగాణ జీవితంలో ఈ మూడు వారాలు అతికీలకం. తెలంగాణ రాజకీయ శక్తులు, ఉద్యమశక్తులు, పౌరసమాజం ఐక్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి, కనీసం నిలువరించడానికి ముగ్గురు నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. కొండ చిలువ నోటికి చిక్కిన పొట్టేలు చందంగా తెలంగాణ పోరాడుతున్నది. ఈ కొండ చిలువలను వదిలించుకోకపోతే అవి పొట్టేళ్లను మాత్రమే కాదు మొత్తం తెలంగాణను మింగేస్తాయి. ఈ నాయకులను చూస్తుంటే విస్మయం కలుగుతున్నది. ఇంతకాలం మనలను పరిపాలించిన నాయకులు వీళ్లా? మన ముఖ్యమంత్రులుగా, మన ఉద్ధారకులుగా భావించింది వీళ్లనా? పరీక్షా సమయం వస్తే వీళ్లు ఎటువైపు నిలబడతారో పసిగట్టలేకపోయామే? ఏ విధానానికీ, ఏ ప్రజాస్వామిక ప్రక్రియకూ, ఏ సంప్రదింపుల క్రమానికీ లొంగని నియంతలనా ఇంతకాలం మనం మోసింది? వీళ్లకు ఏ నీతీ లేదు. ఒకరు బిజెపి వైపు నుంచి నరుక్కొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొకరు దేశమంతా తిరిగి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించండని పార్టీలను కూడగడుతున్నారు. ‘అతడొక్కడే ఒక సైన్యమ’ట. ఆయన దేశాటన చూసి ‘విభజనవాదులు తలకిందులైపోతున్నార’ట. ఇవి ఆయన పత్రికల్లో రాసుకుంటున్నవే. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే సీల్డు…

View original post 441 more words

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s