రామాయణమంత విన్నాక రాముడికి సీత ఏమవుతుంది? అని అనుమానం వచ్చినట్టు ఇన్ని ఉద్యమాలు జరిగాక ఇప్పుడు ”సమైక్యత” అంటే ఏమిటి? ”జై సమైక్యాంధ్ర” అంటే అర్థమేంటి అని చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి!


ఉదయరాగం

‘రాముడికి సీత ఏమవుతుంది?’ అనే పేరుతో ఆరుద్ర ఓ పుస్తకం రాశారు.

ఒక్క వాల్మీకి రామాయణమే కాకుండా ప్రపంచంలో ఇంకా అనేక రామాయణాలున్నాయని ఆయన సోదాహరణగా వివరించారు. అలాంటి ఒక రామాయణంలో రాముడికి సీత చెల్లెలైతే, మరొక రామాయణంలో సీత రాముడికి కూతురని చెప్పుకొచ్చారు. ఆనాటి సాహిత్యం మౌఖికమైనది కావడం వల్లా, అనేక ప్రక్షిప్తాల వల్లా ఎల్లలు దాటినా కొద్దీ కథ రకరకాలుగా మలుపులు తిరుగుతూ వచ్చింది.

ఇది అలా పక్కన పెడితే…

ఇప్పుడు ఇన్నాళ్ల ఉద్యమాలను చూసిన తరువాత ” రాముడు- సీత ” విషయంలో లాగే

అసలు సమైక్యత అంటే ఏమిటి? జై సమైక్యాంధ్ర అంటే అర్థమేమిటి? ఎవరిది నిజమైన నిస్వార్థమైన నికార్సయిన సమైక్యవాదం? ఒక పార్టీకి చెందిన సమైక్యవాది ఇంకో పార్టీకి చెందిన సమైక్యవాదిని ఎందుకు అనుమానిస్తున్నాడు?

ఎందుకు వాళ్లు ఆగర్భ శత్రువుల్లా ఒకరి మీద ఒకరు రాళ్లు విసురుకుంటున్నారు? అసలు ఏం జరిగింది?
ఏం జరుగుతోంది? ఏం జరుగబోతోంది?

ఎవరితో ఎవరు సమైక్యంగా వుండాలనుకుంటున్నారు? ఎవర్ని ఎవరు దుంపనాశనం చేయాలనుకుంటున్నారు? భారత చిత్రపటంలో రెండు భూభాగాలను కలిపి చిత్రించడమేనా సమైక్యత అంటే? ఆ చిత్రపటంలో రెండు రాష్ట్రాలను వేరువేరుగా చిత్రించినంత మాత్రాన అక్కడి ఇక్కడి ప్రజలు ఆగర్భ శత్రువుల్లా మారిపోతారా? భూమి బద్దలవుతుందా?

మరి సమైక్యాంధ్ర అని నినదించేవాళ్లే సమైక్యంగా వుండటంలేదే? ఒక్క ప్రాంతంలో ఒకే నినాదం ఉచ్ఛరించేవాళ్లే తన్నుకుంటున్నారే? మరి వేరే ప్రాంతం వాళ్లతో సఖ్యంగా ఎలా…

View original post 203 more words

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.